మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సు డ్రైవర్ బస్సు గుండె ధైర్యంతో 30 మంది ప్రయాణికులను కాపాడాడు. సోమవారం రాత్రి అమరావతి (MH) నుంచి నాగ్‌పుర్‌కు వెళ్తున్న మినీ బస్సుపై దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు.
డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే చేతికి బుల్లెట్ తగిలినా బస్సును ఆపకుండా 30 కి.మీ నడిపి సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ప్రయాణికుల ప్రాణాలు, ఆస్తులు కాపాడిన అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.