కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు NIA వెల్లడించింది. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించినట్లు తెలిపింది.
ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.