24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్ కళ్యాణ్ తాగేందుకు సిద్ధం అయ్యారు అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 సీట్లకు ఒప్పుకుని ఇపుడు 21 సీట్లు అంటున్నారు.. సొంత అన్నయ్యతో విభేదించా అంటున్నారు.. చిరంజీవికి పవన్ కు పోలిక ఏంటి అని ప్రశ్నించారు. 18 సీట్లు, 80 లక్షల ఓట్లు వచ్చాయి.. చిరంజీవి చాలా సౌమ్యుడు… మరో అన్న నాగబాబుకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారు అని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కామెంట్స్ చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది అని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇల్లు కొనడానికి వస్తే నేను అడ్డుకున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు.. పవన్ వస్తే నాకు ఉన్న 9 ఎకరల్లో ఎంత కావాలంటే అంత ఇస్తాను అని ఆయన తెలిపారు. భీవవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకో పవన్ అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పారు.