బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబులకు మహారాష్ట్రలోని బిలోలి కోర్టు సమన్లు జారీ చేసింది. 2010వ సంవత్సరంలో నమోదైన ఈ కేసులో తాజాగా కోర్టు సమన్లు జారీ చేసింది.
అయితే వారెంట్లు రీకాల్ చేయాలని న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, కృష్ణారెడ్డి కోర్టును కోరారు. మరోవైపు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు బిలోలి కోర్టులో విచారణకు హాజరు అయ్యారు.