భారత దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని, ఇది మతోన్మాద చట్టం అని ఆమ్నెస్టీ తెలిపింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఇది ప్రాథమికంగా వివక్షతతో కూడిన స్వభావం అని వర్ణించింది.