బనగానపల్లె ప్రజలకు ఈ రోజు పండుగ రోజు, అన్నా నాడు వీరబ్రహ్మంద్రస్వామి బనగానపల్లెలో కాలజ్ఞానం రాసినప్పుడు ఏ విధంగా ఆయన చెప్పింది నిజమైందో అదే విధంగా సీఎంగారు ఇచ్చిన హామీలు అన్నీ నిజమయ్యాయి అని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిఅన్నారు. అయన మాట్లాడుతూ..... ఈ ఏడాది వర్షాలు తగ్గినా రైతులకు ఇబ్బంది లేకుండా గోరకల్లు రిజర్వాయర్ నింపి రైతులను ఆదుకున్న చరిత్ర సీఎంగారిది, అదే విధంగా ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని, బనగానపల్లెలో 4 లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ ఇలా అన్నీ ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం, సీఎంగారి సహకారంతో ప్రతీ పల్లెకు రోడ్డు, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటుచేశాం, ఇక్కడ టీడీపీ నాయకుడు బీసీ జనార్ధన్ రెడ్డి ఇళ్ళ పట్టాలు అడ్డుకుని రాకుండా చేశారు, మనం మళ్ళీ అధికారంలోకి రాగానే వారందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలి, ఇక్కడ నాపరాతి గనుల్లో పనిచేస్తున్న పేదల బతుకులు మారేలా మళ్ళీ మన ప్రభుత్వం రాగానే గనులకు రాయల్టీ తగ్గిస్తే వారికి ఉపాధి దొరుకుతుంది, స్ధానికంగా ఉన్న నీటి సమస్యను తీర్చేలా నిధలు, పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేయడం వల్ల ఈ ప్రాంత వాసులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది, ఇప్పటివరకు ఏ ప్రమాదం జరిగినా కర్నూలు వెళ్ళాల్సివచ్చేది, కానీ ఇప్పుడు ఇక్కడే ఏర్పాటుచేశారు అని తెలిపారు.