ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణపై ఇప్పటికే రైతులు మండిపడుతున్నారు. తాజాగా ఇప్పటికే పరిహారం చెల్లించిన భూములు, రోడ్లు, మౌలిక సదుపాయాల కొసం కేటాయించిన భూముల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించింది. ఇప్పటికే పరిహారం చెల్లించిన 191 ఏకరాలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కోసం సేకరించిన 220 ఎకరాలు.. ఈ భూముల నోటిఫికేషన్ ఉపసంహరిస్తే రాజధాని మాస్టర్ ప్లాన్ చిన్నాభిన్నం అవుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే లోపే ఈ ప్రతిపాదనలుపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు చకచకా ఫైళ్ళను పరుగెత్తిస్తున్నారు. షెడ్యూల్ లోపే ఉపసంహరణ గెజిట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.