ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చిన వారి జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే.. అందులో దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు అదానీ, అంబానీ, రతన్ టాటా పేర్లు కనిపించలేదు.
రాజకీయాలకు అంటీముట్టనట్టుగా ఉండే టాటా సంగతి పక్కన పెడితే.. అదానీ, అంబానీ పేర్లు లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్రంలోని BJPతో అదానీ, అంబానీలకు మంచి సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిందే.