తాడిపత్రి పట్టణంలోని సంజీవ నగర్, భగత్ సింగ్ నగర్, నందలపాడు, శ్రీనివాసపురం, సుంకులమ్మ పాలెం, గణేష్ నగర్, తూర్పుపాలెం, అంబేద్కర్ నగర్, గాంధీనగర్‌కు చెందిన 21మంది లబ్దిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వయంగా ఆయా లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి మంజూరైన 18. 27 లక్షల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.