తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దండరంపట్టు సమీపంలో రాధాపురం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని చెరకు తోటలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం వివస్త్రగా పడి ఉంది.
చెరకు కోసేందుకు వచ్చిన కూలీలు చూసి షాక్కు గురై పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం నగ్నంగా ఉండడంతో పాటు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాండరాంపు పంచాయతీకి చెందిన శంకర్ కుమార్తె రాజేశ్వరి (30) గా గుర్తించారు.