ఏపీలో రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కాకినాడ-చెంగల్పట్టు-కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి పుదుచ్చేరి వరకు నడవనుంది. 17644 నంబరు కాకినాడ-చెంగల్పట్టు మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ-పుదుచ్చేరి మధ్య ఆదివారం, బుధవారం, గురువారం నడవనుంది. మిగిలిన నాలుగు రోజులలో.. అంటే సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలలో కాకినాడ-చెంగల్పట్టు మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. 17643 నంబరు గల చెంగల్పట్టు-కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు చెంగల్పట్టు-కాకినాడ మధ్య మిగిలిన నాలుగు రోజులు అనగా మంగళవారం, బుధవారం, శనివారం, ఆదివారంలో రాకపోకలు సాగించనుంది.
ఈ మేరకు గురువారం పుదుచ్చేరి-కాచిగూడ మధ్య పొడిగించిన రైలు ప్రారంభమైంది. ఈనెల 15న కాకినాడ-చెంగల్పట్టు మధ్య, ఈ నెల 16న చెంగల్పట్టు-కాకినాడ మద్య పొడిగించిన రైళ్లు ప్రారంభం కానున్నాయి. మిగిలిన వివరాలకు సమీప రైల్వే స్టేషన్‌లో బుకింగ్ కార్యాలయం నందు సిబ్బంది ద్వారా తెలుసుకోవచ్చని, పాత టైమింగ్స్‌లోనే రైలు రాకపోకలు కొనసాగిస్తారు. కాకినాడ, సామర్లకోట మీదుగా పుదుచ్చేరి ప్రాంతానికి ఏకైక ఎక్స్‌ప్రెస్ రైలుగా సర్కార్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కావడం విశేషం.
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించాలని యానాం ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. సామర్లకోట మీదుగా సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుండడంతో సామర్లకోట పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైలు ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది. మరోవైపు 17652 నంబరు గల కాచి గూడ-చెంగల్పట్టు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు పుదుచ్చేరి వరకూ వారంలో మూడు రోజుల పాటు ఆదివారం, బుధవారం, గురువారంలో పుదుచ్చేరి వరకూ వెళ్లనుంది. 17651 నంబరు గల చెంగల్పట్టు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు పుదుచ్చేరి నుంచి కాచిగూడ వరకూ వారంలో మూడు రోజుల పాటు అనగా సోమవారం, గురువారం, శుక్రవాారాల్లో వెళ్లనుంది.