ఉద్యమాల ద్వారా సాధించుకున్న బదిలీల కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ దుర్మార్గమైన దొడ్డిదారి సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజంపేటలోని డిఇఓ క్యాంపు కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్రమ బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఫార్సు బదిలీల పర్వం లో కోట్లాది రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.