గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను రూ.600 కోట్లకు జగన్ అమ్మేశారు. గంగవరం పోర్టును వైఎస్ హయాంలో నిర్మిస్తే, జగన్ అమ్మేశారు. ఇక్కడ ఉన్న జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి చివరకు రియల్ ఎస్టేట్‌కు విక్రయించారు. ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని జగన్ ఒక్క తీర్మానం చేసి సరిపెట్టుకున్నారే తప్ప ఎందుకు ఉద్యమించలేదు? ఉక్కు కర్మాగారం అమ్ముతున్న బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు నాయకులూ మోదీ దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన ఇటువంటి నాయకులను గెలిపించడం అవసరమా? వైసీపీ ఎమ్మెల్యేలను ఒకచోట నుంచి మరో చోటకు బదిలీ చేశారు. ఒకచోట పనికిరాని వ్యక్తి మరో చోట ఎలా పని కి వస్తాడు? రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది. పదేళ్లలో రాజధాని కట్టలేదు. మద్యం నిషేధిస్తేనే ఈసారి ఓట్లు అడుగుతామని చెప్పిన పెద్దమనిషి...అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం విక్రయిస్తున్నారు. విచిత్రమైన బ్రాండ్‌లతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న వ్యక్తి(జగన్‌ను ఉద్దేశించి) మాట మార్చారు. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాం. వైసీపీ, టీడీపీ వద్ద నగదు తీసుకొని ఓటు కాంగ్రె్‌సకు వేయాలి’’ అని షర్మిల కోరారు.