చిలకలూరిపేటలో నేడు జరగనున్న సభకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఐజీ పాలరాజు, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ట్రాఫిక్ మళ్లింపు వివరాలను శనివారం ప్రకటించారు. జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ మీదగా విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు-దిగమర్రు జాతీయ రహదారి 214-ఏ పైకి మళ్లించి ఒంగోలు, త్రోవగుంట, చీరాల, పెనుమూడి, రేపల్లె, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం హైవేకి కలపనున్నారు. చెన్నై నుంచి ఒంగోలు మీదుగా నార్కెట్‌పల్లి జాతీయ రహదారి 36పై హైదరాబాదుకు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్‌కు దారి మళ్లించారు.కోల్‌కతా నుంచి చెన్నైకి ఎన్‌హెచ్ 16 మీదుగా చెన్నై వెళ్లే భారీ వాహనాలను విశాఖపట్నం, హనుమాన్ జంక్షన్ మీదుగా దిగమర్రు-ఒంగోలు ఎన్‌హెచ్ 214-ఏపై మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, రేపల్లె, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లించనున్నారు.హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్ 9పై కోల్‌కతా వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, విశాఖపట్నం మీదుగా మళ్లిస్తారు. హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్ 9పై చెన్నై వెళ్లే భారీ వాహనాలను నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, మేదరమెట్ల, ఒంగోలుమీదుగా చెన్నైకు పంపుతారు.