రాష్ట్రంలో సగటున 887 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,09,37,352 ఉండగా, మొత్తం 46,165 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ వివరాలు చెప్పారు. నామినేషన్ల తేదీకి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం ఫామ్-6 దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే ఇప్పటి నుంచి ఫామ్-7, 8 దరఖాస్తులను అనుమతించోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు మూడు సార్లు ప్రతికల్లో ప్రకటలు ఇవ్వాలన్నారు.రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,09,37,352. అందులో పురుషులు 2,00,84,276 మంది, మహిళలు 2,08,49,730 మంది, ట్రాన్స్‌జెండర్లు 3,346 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,763 మంది, సర్వీసు ఓటర్లు 67,393 మంది ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 46 వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసరంగా మరికొన్ని పోలింగ్ కేంద్రాలను పెడుతున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సగటున 887 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ఉండేలా 179 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. యువ ఓటర్ల కోసం 50, పీడబ్య్లూడీ ఓటర్ల కోసం ప్రత్యేకంగా 63, మోడల్ పోలింగ్ కేంద్రాలు 555, ఎక్సెప్టెడ్ యాగ్జులరీ పోలింగ్ స్టేషన్లు 219 ఏర్పాటు చేయనున్నారు. ఎపిక్ కార్డులు లేనప్పుడు 12 రకాల కార్డులను పోలింగ్ స్టేషన్‌లో గుర్తింపు కార్డుగా వాడుకోవచ్చు.3.82 లక్షల మంది సిబ్బంది: రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి పోలీసు సిబ్బంది గాక 3,82,218 మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. జనరల్ అబ్జర్వర్లు 50,115 మంది, ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు 13 మంది రానున్నారు. ఎన్నికల బందోబస్తులో 2,18,515 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటారు. పారామిలటరీ బలగాలను కూడా ఎన్నికల విధులకు కేటాయిస్తారు. 85 ఏళ్లు నిండిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్ వచ్చాక ఫామ్-12 ద్వారా రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని పోస్టల్ బ్యాలెట్‌గా గుర్తిస్తారు. 10 రోజుల ముందే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటారు.