కృష్ణాజిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. కలెక్టరేట్‌లోని మీడియా పాయింట్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం నుంచీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతుందని ఆయన అన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించే నాటికి జిల్లాలో 15లక్షల 18వేల 755 మంది ఓటర్లు ఉన్నా రని, వీరిలో పురుషులు 7లక్షల 37వేల 394, మహిళా ఓటర్లు 7 లక్షల 80వేల 796 మంది ఉన్నారని తెలిపారు. ఓటర్ల తుది జాబితా ప్రకటిం చాక నూతనంగా ఓటర్లుగా చేరేందుకు మరో 55 వేల మంది దర ఖాస్తు చేసుకున్నారని, వీటిని పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పి స్తున్నామన్నారు. ఇప్పటికే 50వేల ఓటరు గుర్తింపు కార్డులను పోస్టల్ శాఖకు అందజేశామన్నారు. జిల్లాలో 1563 పోలింగ్ స్టేషన్లు, 1010 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.