పేదలకు దొంగపట్టాలు ఇచ్చి, వారిని మోసగిస్తూ పేదల పక్షాన ఉన్నానని పేర్ని నాని చెప్పడం హాస్యాస్పదం. ఓటమి భయంతోనే ఆయన అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇష్టారాజ్యంగా స్థలాలను తన అనుయాయులకు కట్టబెడుతున్నారు. ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు, మెరక చేయడంలో భారీ అవినీతి జరిగింది. అధికారంలోకి వచ్చాక వాటిపై సీబీఐ విచారణ జరిపిస్తాం. మెడికల్ కళాశాల భూసేకరణలో రూ.8 కోట్ల అవినీతి జరి గిందని కాగ్ నివేదిక ఇచ్చింది. టిడ్కో ఇళ్లలోనూ ఎన్నో అక్రమాలు జరుగుతు న్నాయి’’ అని టీడీపీ-జనసేన-బీజేపీ మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర ధ్వజ మెత్తారు. టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణతో కలిసి ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. బందరు పోర్టు నిర్మాణానికి చంద్రబాబు హయాంలో భూములు సేకరించిన సంగతి మర్చిపోయారా పేర్ని నానీ అని రవీంద్ర ప్రశ్నిం చారు. అవినీతిలో జగన్‌తో పేర్ని నాని పోటీపడుతున్నారని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ విమర్శించారు. వైసీపీ నాయకుల రాజ్యం నరకాసుర రాజ్యమని ఈ రాజ్యం పోయిన మర్నాడు టపాసులు కాలుద్దామని అన్నారు. తాను పార్కులో ఇల్లు కట్టుకున్నానని పేర్ని నాని చెబుతున్నారని, పక్కా సర్వేనెంబర్లు ఉన్న భూమిలోనే ఇల్లు కట్టుకున్నానని టీడీపీ నాయకుడు దిలీప్ కుమార్ పేర్కొ న్నారు. పేర్ని నాని కుటుంబసభ్యులు అనారోగ్యంగా ఉన్న సమయంలో చంద్ర బాబుతో సీఎం రిలీఫ్ ఫండ్‌ను టీడీపీ నేత గోపీచంద్ ఇప్పించిన విషయం గుర్తుం చుకోవాలన్నారు. స్ట్రీట్‌ఫీల్డ్‌లో ఉన్న స్థలాలకు పట్టాలు ఇచ్చారని, ఆ పట్టాలపై ఏ సర్వేనెంబర్లు లేవని తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని దిలీప్ అన్నారు.