టీడీపీ అధినేత చం ద్రబాబుతో కలిసి నాలుగు దశాబ్దా లకు పైగా కలిసి పనిచేశానని, నా వ్యక్తిత్వం గురించి ఆయనకు పూ ర్తిగా తెలుసని, చంద్రబాబు నిర్ణ యమే మాకు శిరోధార్యమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకు డు గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాటకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని, మాపై అవాస్తవాలను ప్రచారం చేస్తే వారికి మిగిలేది నిరాశే అని స్పష్టం చేశారు. తాము ఏనాడూ పార్టీని వీడమని, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాన్నారు. పార్టీ టికెట్ అనేది మనపై నమ్మకంతో, గౌరవంతో మనకు ఇచ్చేది తప్ప, టిక్కెట్ కోసం ఎప్పుడూ కక్కుర్తి పడలేదన్నారు. పార్టీలోని గ్రూపు రాజకీయాలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ఈ విషయంపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ గ్రూపు రాజకీయాలతో తాను నష్టపోయానని, వీటికి తన భార్య లక్ష్మీదేవి కూడా బలి కాకూడదన్నదే తన భావన అని తెలిపారు. ఏదేమైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని, చంద్రబాబు నిర్ణయం ప్రకారం పార్టీ కోసం, నిజాయితీగా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.