వజ్రపుకొత్తూరు, నువ్వలరేవులో ఊరంతా పందిర్లు.. ఇంటింటా పెళ్లి సందడి నెలకొంది. శనివారం రాత్రి ఒకే ముహూర్తానికి 61 జంటలు ఒక్కటయ్యాయి. సంప్రదాయం ప్రకారం వధువరుల మేనమామలు వారి ఇంటికి ఆహ్వానం పలికి పెళ్లిపందిరిలో గౌరవంగా శాలువ కప్పుతూ, దుస్తు లు బహూకరించారు. పెళ్లి కుమార్తే ఇంటికి సారిసామగ్రితో పాటు అలంకర వస్తువులతో పేరంటాలు వెళ్లి అలంకరిం చారు. గ్రామంలోని కోనేరు వద్దకు మంగళవాయిద్యాలతో వెళ్లి అక్కడ నుంచి మట్టి, నీటిని తీసుకువచ్చి వధువరు లను మంగళస్నానాలు చేయించారు. చెరువు వద్ద వధువ రులు దాసుడు, డొంబురు, మార్కండేయులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. సాయంత్రం మంగళవాయిద్యాలు. స్నేహితులతో కలిసి గ్రామంలో ఉన్న 43 వీధులను తిరుగుతూ పెళ్లి కుమారులు తన పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం వరుడు బంధువులు, స్నేహితులతో కలిసి వధువు ఇంటికి చేరుకున్నారు. శనివారం రాత్రి 1.55 గంటలకు సామూహిక వివా హాలు నిర్వహించారు.