సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో పకడ్బందీగా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహిస్తామని శ్రీకాకుళం కలెక్టర్ మన్ జీర్ జీలానీ సమూన్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సందర్భంగా శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వివరించారు. ఇలా.. ‘ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వలంటీర్లను, కాంట్రాక్టు ఉద్యోగులను వినియోగించం. జిల్లాలో మొత్తం 18,63,520మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు నమో దు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. ఓటు మరోచోట నుంచి ఇక్కడకు బదిలీ చేసుకునేందుకు(ఫారం-6) అవకాశం కల్పించాం. అలాగే 2,357 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశాం. ఎన్నికల నిర్వహణకు 16,978 మంది సిబ్బందిని వినియోగిస్తాం. అదనంగా పదివేల మంది బందోబస్తు ఉంటుంది.