కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన తర్వాత పుట్టిన వారికి జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. జనన, మరణాల నమోదు కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.
ఈ చట్టం ప్రకారం జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికెట్ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.