ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదల చేసిందని, దీనితో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.