ఏపీలో జాతీయ రహదారులపై అత్యవసర విమానాల ల్యాండింగ్ రన్‌వేను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. విజయవాడ-ఒంగోలు మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిపై,
బాపట్ల జిల్లా కొరిశపాడు-రేణింగవరం మధ్య నేషనల్ హైవేపై విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు. హైవే అథారిటీ రూ.79 కోట్లతో 4.1 కి.మీ. పొడవైన రహదారిని ప్రత్యేకంగా నిర్మించారు. ట్రయల్ రన్ ఉండటంతో హైవేపై వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.