ఉత్తర చైనాలోని ఎక్స్ప్రెస్వే టన్నెల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 51 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. టన్నెల్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
మరో 37 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.