గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి నీరు విడుదల చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. జిల్లా పాలనాధికారి సూచనల మేరకు, బుధవారం రిజర్వాయర్లోకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో బుధవారం ఉదయం నాటికి 5: 12 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.