దేశ చరిత్రలోనే ముస్లిం మైనారిటీల మేలు కోరిన ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరని ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్లతో ముస్లింల సంక్షేమానికి ఒకడుగు ముందుకు వేస్తే, సీఎం జగన్ వారిని అన్ని విధాలా బలోపేతం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన బాబూఖాన్ ను అప్పిరెడ్డి మంగళవారం గుంటూరులో సత్కరించారు.