ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి పోలీసులు చెక్ చేశారు. కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో చెక్ చేస్తున్నామని లోకేష్‌కి పోలీసులు చెప్పారు. కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ చెక్ చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంటు వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్నట్టు నారా లోకేష్ తెలిపారు.