దాదాపు రూ. 15,000 కోట్ల జీఎస్టీ మోసం చేసిన ఇద్దరు వ్యాపారవేత్తలను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. 28 ఏళ్ల అజయ్ శర్మ, 38 ఏళ్ల సంజయ్ జిందాల్గా గుర్తించిన మోసగాళ్లను బుధవారం సోనిపట్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో హర్యానా పోలీసులు ఇప్పటికే కనీసం 30 మంది నిందితులను అరెస్టు చేసారు.శర్మ మరియు జిందాల్ నకిలీ ఆధార్ మరియు పాన్ వివరాలను ఉపయోగించి 3,000 కంటే ఎక్కువ షెల్ కంపెనీలను స్థాపించారు మరియు వారి తరపున ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకున్నారు. ఈ ఇద్దరు మోసగాళ్లు గతేడాది జూన్‌లో కేంద్రం నుంచి రూ.26 కోట్లు వసూలు చేశారు. గత ఏడాది పోలీసులు 30 మందిని అరెస్టు చేశారని, నకిలీ పత్రాలపై కేంద్ర ప్రభుత్వం నుండి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందుతున్న ముఠాను ఛేదించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.