కొందరు డ్రైవర్లు పరిమితికి మించి జనాలను వాహనాల్లో ఎక్కించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీని వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆటో డ్రైవర్లకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా తీరు మారడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. చీరాల- కారంచేడు మార్గంలో ఆటోలలో మహిళా కూలీలను ఎక్కించుకొని వెళ్లడం పరిపాటిగా మారింది. ప్రమాదపు అంచున వెళ్తున్న ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa