ప్రపంచంలోనే తొలిసారిగా ఓ సజీవ రోగికి పంది కిడ్నీని మార్పిడి చేశారు. అమెరికాలో జరిగిన ఈ సర్జరీ విజయవంతమైనట్టు అక్కడి వైద్యులు తెలిపారు.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 62 ఏండ్ల రోగికి 4 గంటలపాటు సర్జరీ చేసి పంది కిడ్నీని అమర్చినట్టు మసాచుసెట్స్ దవాఖానా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కొలుకుంటున్నాడు. ఈ ప్రయోగం సత్పలితాలు ఇస్తే ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారికి శుభవార్తనే చెప్పుకోవాలి.