మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో శనివారం గుడిబండ మండల జమ్మల బండ గ్రామానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు తిప్పేరుద్రప్ప కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో తిప్పే రుద్రప్ప తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గం అభివృద్ధికి రఘువీరారెడ్డి నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు.