అద్దంకి మండలం కుంకుపాడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ తాళ్లూరు రోడ్డు నుండి వస్తుండగా ద్విచక్ర వాహనం పై నుండి జారిపడి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.