టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. భీమిలి నియోజకవర్గంలో ఆయన పేరుతో టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో గంటాకు సానుకూలంగా ఫలితాలు వచ్చినట్లు సమాచారం. దాంతో గంటాకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రకటించబోయే నాలుగో జాబితాలో గంటా పేరు ఉండనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa