ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో ఒక రోజున ఎర్త్ అవర్‌ను జరుపుకుంటారు. ఈ ఎర్త్ అవర్‌ను తొలిసారి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అనే సంస్థ ప్రారంభించింది.
ఇంధన, సంరక్షణ, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా కేవలం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ శ్రీకారం చుట్టింది. 2007 నుంచి ప్రపంచంలోని 7 వేల నగరాలు ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.