ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మద్దతు ప్రకటించారు. ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని, రాష్ట్రం నుంచి అరాచక పాలనను తరిమికొడతామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమికి జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలుపడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ప్రగతిశీల, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమాన ఆలోచనలు కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి రావాలని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.