మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం మాలే నత్తం పంచాయతీ సింగంవారిపల్లెలోని వెంకటేశ్వరస్వామి ఆల యంలో చోరీ జరిగినట్లు శనివారం గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారి విగ్రహానికి ఉన్న 75గ్రాముల బంగారు నగలు, సుమారు 1కేజీ వెండి గిన్నెలు, ఆలయంలోని బీరువాలో ఉన్న స్వామివారి పట్టువస్త్రాలు, హుండీ పగలగొట్టి అందులోని నగదు అపహరిం చుకుపోయారు. ఆలయ ప్రాంగణంలో మద్యం ఖాళీ బాటిళ్లు ఉండడంతో దుండగులు ఇక్కడే మద్యం తాగి అనంతరం చోరీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.