పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. "జనసేన అనేది రెసిడెన్షియల్ కాలేజీ వంటిది.. ఒక కార్పోరేట్ ఆఫీస్‌లా నడుపుతున్నారు. పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారు. జనసేనలో మహిళలకు, బీసీలకు విలువ లేదు. నాదెండ్ల మనోహర్ టీడీపీకి కోవర్ట్." అని ఆరోపించారు.