రానున్న ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు లేకపోవడం పార్టీవర్గాల్లో చర్చకు దారితీసింది. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కు విశాఖ దక్షిణ సీటు కేటాయిస్తానని జనసేన అధినేత హామీ ఇవ్వడంతో పాటు కొద్దిరోజుల కిందట మంగళగిరిలో ధ్రువీకరణ పత్రం కూడా అందజేశారు. దీంతో నియోజక వర్గంలో వంశీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా నియోజకవర్గంలోని కొందరు జనసేన నేతలు వంశీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం కలకలం రేపింది. దీనిపై ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ సీటును పెండింగ్‌లో పెట్టడం వంశీతో పాటు కేడర్‌లో ఉత్కంఠకు దారితీసింది. పెండింగ్‌కు కారణాలపై నేతలెవరూ మాట్లాడడంలేదు. వివాదాల మధ్య దక్షిణ స్థానంపై పవన్‌కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు.