సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రాష్ట్రంగా మార్చారని టీడీపీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య ఆరోపించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా పెద్ద ఎత్తున భయటపడడంతో యువత తల్లిదండ్రులు తీవ్రభయాందోళన చెందుతున్నారన్నారు. వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తాటిపాడు, తంగడంచ గ్రామ వైసీపీ నాయకులు ఆదివారం టీడీపీలో చేరారు. అల్లూరు గ్రామంలోని టీడీపీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి నివాసంలో సమక్షంలో తాటిపాడు వీరారెడ్డి, ప్రభాకరెడ్డి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీ చేరాయి. అలాగే తంగడంచ గ్రామ వైసీపీ నాయకులు కూడా మధు, గోకారమయ్యలతో పాటుగా మరికొంత మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి మాండ్ర శివానందరెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ అభ్యర్థి జయసూర్య, మాండ్ర సురేంద్ర నాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.