రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అనంతరం ఆదివారం వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
సంగీత కచేరీపై తుపాకులు, బాంబులతో విరుచుకుపడిన వారిలో తామూ ఉన్నామని కోర్టు ముందు వెల్లడించారు. దీంతో ఈ నలుగురిని మే 22 వరకు కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.