విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్.. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయమని పోతిన మహేశ్ అన్నారు. పవన్‌పై తనకు నమ్మకం ఉందని, నాకు టికెట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని మహేశ్ అన్నారు.