విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండల టీడీపీ ఆత్మీయ పరిచయ సమావేశాన్ని విజయనగరం పట్టణంలోని ప్రైవేట్ హోటల్లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్ధి లోకం నాగమాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకులంతా ఐకమత్యంతో ఏకతాటిపై పనిచేసి జన సేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా తనను గెలిపించాలని కోరారు. నియోజవర్గంలో యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. వివిధ గ్రామాల్లో ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అంతకు ముందు టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, కడగల అనంద్ కుమార్, సువ్వాడ వనజాక్షి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులను మాధవికి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోకం ప్రసాద్, కంది చంద్రశేఖర్, మహంతి చిన్నంనాయుడు, పతివాడ తమ్మినాయుడు, గేదెల రాజారావు తదితరులు పాల్గొన్నారు.