ఇటుకలను అందిస్తున్న నైపుణ్య కార్మికులతో మంత్రి అంబటి కొద్దిసేపు గడిపారు. బట్టీలో శ్రమజీవన సౌందర్యానికి ఆయన హ్యాట్సాఫ్ చెప్పారు. మంగళవారం సత్తెనపల్లి నుండి లక్కరాజు గార్లపాడు మార్గమధ్యంలో ఉన్న బట్టీల వద్ద కార్మికులు అంబటిని నిలిపి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కొద్దిసేపు పరిశీలించి, స్వయంగా మట్టి ముడి ఇటుకను తయారు చేశారు. కార్మికులతో మాట్లాడారు.