నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో వైసీపీ కార్యకర్త కొలకలూరి నాగమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున సోమవారం ఆ గ్రామానికి చేరుకుని ఆమె మృత దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రి వెంట వైసీపీ నాయకులు, కార్య కర్తలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa