పెందుర్తి టికెట్ కేటాయించకపోవడంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బండారు అనుచరులు ఇంటికి చేరుకుని ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, కరపత్రాలను తగలబెడుతున్నారు. పెందుర్తి టికెట్ విషయంతో చంద్రబాబు, లోకేశ్.. బండారును మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారుకు సీటు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.