ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా కారంచేడు పోలీస్ స్టేషన్ కు రెగ్యులర్ ఎస్ఐ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎస్సైగా ఉన్న సురేష్ ను ఏ కారణం చేతనో గుట్టు చప్పుడు కాకుండా విఆర్ కు పంపారు. అయితే కొత్త ఎస్ఐ ని మాత్రం మంగళవారం నాటికి కూడా నియమించలేదు. దీంతో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చు పెరిగాయి. ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడంతో కారంచేడులోని రెండు ఫ్యామిలీ రెస్టారెంట్లలో మద్యం సరఫరాకు అంతులేకుండా ఉంది.