పులివెందుల రానున్న ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అర్బన్ సీఐ శంకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పులివెందుల మండలంలోని తుమ్మలపల్లి గ్రామం లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని నాయకులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఘర్షణలకు పాల్పడవద్దని వారికి సూచించారు.