ఓ వ్యక్తి పై కోడి కత్తులతో దాడి చేసిన ఘటన మంగళవారం మదనపల్లెలో వెలుగు చూసింది. పోలీసుల కథనం. పులివెందులకు చెందిన శ్రీనివాసులు తన చెల్లెలును మదనపల్లి మండలం సీటీఎంలోని శేఖర్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. భర్త చనిపోవడంతో ఆ ఆస్తి పై బంధువులు కన్నేసి ఆమెను బెదిరిస్తుండడంతో అన్నకు ఫోన్ చేసింది. సీటీఎం వచ్చి నిలదీసిన శ్రీనివాసులును ఇద్దరు వ్యక్తులు కోడి కత్తులతో దాడిచేసి హత్యయత్నంకు పాల్పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa