ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన పారదర్శక సంక్షేమ పథకాలు పేదల జీవన విధానాన్ని మెరుగుపరిచాయని, ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి ఆయన బుల్లెట్ పై ద్విచక్ర వాహన ర్యాలీతో యాత్ర సాగించారు. అంబటి వెంట నియోజకవర్గ అశేష వైయస్సార్సీపి సైన్యం తరలి వెళ్ళింది.