విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తొలినుంచి మద్దతు ఇస్తున్న పార్టీ వైయస్ఆర్సీపీనే అని ఉత్తరాంధ్ర వైయస్ఆర్సీపీ జోనల్ ఇంచార్జ్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం విశాఖపట్నం దక్షిణ నియోజకరవర్గ పరిధిలోని దుర్గాలమ్మ కోవెల వద్ద వైయస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖపట్నం దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లకు మద్దతుగా వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ పార్టీలు విశాఖ స్టీల్ ఉద్యమకారులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.